Site icon vidhaatha

ఎడ్యూకేషనల్ హబ్‌గా వరంగల్‌: మంత్రి డి. శ్రీధర్‌బాబు

విధాత : రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని, వరంగల్‌ను ఎడ్యూకేషనల్ హబ్‌గా తీర్చిదిద్ధుతామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కార్యాలయాలు స్థాపించాలని కోరారు.

ఎన్నారైలకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు త్వరలో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్‌లో అనేక బహుళా జాతీ కంపనీలను ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు. ప్రైవేటు పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. వరంగల్‌, హనుమకొండల పారిశ్రామిక అభివృద్ధికి, తద్వారా ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

Exit mobile version