కరోనా కష్టకాలాన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు కాసులు సంపాదించుకునేందుకు వాడుకోవడంపై మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు కట్టకపోతే డెడ్ బాడీలను బంధువులకు ఇవ్వరా అని ప్రశ్నించారు.
కరోనా పేషెంట్లకు ఎంత ఛార్జీ చేయాలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన జీవో ద్వారా చెప్పిందని, ఇప్పటికీ అది అమల్లోనే ఉందని, అయినా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.