Site icon vidhaatha

ఫణిగిరి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మార్చి 3 నుంచి 14 వరకు తేదీ వరకు జరగనున్న శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను విద్యుత్ శాఖ మంత్రి
గుంటకండ్ల జదీశ్వర్ రెడ్డి సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రావుతో కలిసి ఆవిష్కరించారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ నాగారం మండల అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, ఆలయ చైర్మన్ ఆవుల సతీష్, వైస్ చైర్మన్ మామిడి మల్లయ్య, ముద్దిరెడ్డి శేఖర్ రెడ్డి, కల్లెట్లపల్లి శ్రీనివాస్, జంపాల రాజు, మల్లయ్య, బాబు, తిగుళ్ళ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version