బీఆరెస్ 8 నుంచి 12 సీట్లు గెలిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా

బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో చెప్పినట్లుగా బీఆరెస్‌ 8 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిస్తే నా మంత్రి పదవికి రాజీనానూ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

  • Publish Date - April 24, 2024 / 12:34 PM IST

పార్టీ మారుతామన్న ఎమ్మెల్యేల పేర్లు నేను చెబుతా…నీవు చెప్పు
కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో చెప్పినట్లుగా బీఆరెస్‌ 8 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిస్తే నా మంత్రి పదవికి రాజీనానూ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలను సైతం వెంకట్‌రెడ్డి తిప్పికొట్టారు. కాంగ్రెస్‌లోకి వస్తామన్న 25 మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేల పేర్లు నేను చెబుతానని, మరి కాంగ్రెస్ నుంచి బీఆరెస్‌లో వస్తామన్న 25మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తోందని కోమటిరెడ్డి ధీమా వ్య కేసీఆర్ మాటలన్ని ఆయన పార్టీని కాపాడుకునేందుకు. ఆ పార్టీ నేతల వలసలను ఆపేందుకు చేసిన డాంభికాలేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా అర్భకులు కాదని, అర్జునులై అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి గెలిచామన్నారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులకు నిధులివ్వకుండా అన్యాయం చేసిన కేసీఆర్‌కు ఈ జిల్లా ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ మాయ మాటలకు కాలం చెల్లిందని, పార్టీని కాపాడుకునేందుకు బస్సు యాత్ర కాదు..మోకాళ్ల యాత్ర చేసినా పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌కు ఒక్క సీటు రాదన్నారు.

Latest News