విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ గురువారం పరిశీలించారు. ప్రజాసేవ కేంద్రంలో ప్రస్తుతం అమలవుతున్న గ్యారంటీ స్కీమ్స్ లలో మహాలక్ష్మి పథకం ద్వారా అమలవుతున్న 500 కి గ్యాస్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు వీటికి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ సవరణలు ప్రజా సేవ కేంద్రంలో జరుగుతున్నాయని తెలిపారు.
లబ్ధిదారులు, ప్రజలు ఈ సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో చిత్తశుద్ధితో ఉందన్నారు. లబ్ధిదారులు పథకాల అమలులో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై ప్రజా సేవా కేంద్రాల ద్వారా పరిష్కరించుకుని ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని పొందాలన్నారు