Site icon vidhaatha

Ponnam Prabhakar | నక్షత్ర దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

కొత్తకొండ శ్రీ వీర భద్ర స్వామివారి ఆలయంలో దీక్ష

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ నక్షత్ర దీక్ష స్వీకరించారు. భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి నక్షత్ర దీక్షను స్వీకరించారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం కోట్లాడే దైర్యం ఇవ్వాలని అనేక సందర్భాల్లో మొక్కుకున్నానని, అలాగే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా ధైర్యాన్ని మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుని ఈ దీక్ష స్వీకరించినట్లుగా మంత్రి పొన్నం తెలిపారు. ఈరోజు నియోజకవర్గ అభివృద్ధికి ఇక్కడి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా అన్ని కార్యక్రమాల్లో విజయవంతం అయ్యేలా ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని వేడుకుంటూ దీక్ష చేపట్టానన్నారు.

Exit mobile version