Site icon vidhaatha

8వ తరగతి వరకు టీసీ అవసరం లేదు-శ్రీదేవసేన

విధాత,హైదరాబాద్:విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ (బదిలీ ధ్రువపత్రం) తప్పనిసరి. అయితే, ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన స్పందించారు. నిజానికి 8వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు టీసీ అవసరం లేదని, విద్యాహక్కు చట్టంలో టీసీ అవసరం లేదన్న విషయం స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆయా జిల్లాల్లోని డీఈవోలను సంప్రదించాలని సూచించారు.కొత్త స్కూల్స్ లో చైల్డ్ ఇన్ఫో డేటాలో పేరు నమోదు అయ్యేలా చూడాలని శ్రీదేవసేన సూచించారు.

రాష్ట్రంలో జూలై 1 నుంచి విద్యాసంస్థలు తెరువనున్న నేపథ్యంలో స్కూల్ ఫీజులపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

Exit mobile version