Site icon vidhaatha

లాక్‌డౌన్‌పై ఎటువంటి నివేదిక ఇవ్వ‌లేదు

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల‌ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్లు ప‌లు ఎల‌క్ట్రానిక్ మీడియా, సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు. వైద్య ఆరోగ్య శాఖ అటువంటి ప్ర‌తిపాద‌న‌లేవీ ఇవ్వ‌లేదు.

ప్రస్తుతం తెలంగాణ‌లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌లో స్థిర‌త్వం వ‌చ్చింది. ప్ర‌జ‌లు ఇలాగే జాగ్ర‌త్త‌లు పాటిస్తే మ‌రో 3-4 వారాల్లో వైర‌స్ అదుపులోకి వ‌స్తుంది. కాబ‌ట్టి లాక్‌డౌన్ పెట్టాల‌నే ఆలోచ‌న కానీ, ప్ర‌తిపాద‌న‌లు కానీ ఏమీ ఇవ్వ‌లేదు. క‌నీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్య ఆరోగ్యశాఖ‌కు లేదు.

Exit mobile version