Site icon vidhaatha

నాగార్జున సాగ‌ర్‌ జలాశయంలో ‘నీటి ‌కు‌క్కల’ సందడి

విధాత:నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు దర్శనం ఇచ్చాయి.ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ జలాశయంలోకి ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైంది.దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్‌‌లోని వాటర్ స్కెల్ సమీపంలో దర్శనమిచ్చాయి.అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకొని నీళ్లలోనే జీవిస్తాయి.నీళ్ల లోపల ఈదుతాయి.నీళ్ల లోపల, నీళ్ల బయట జీవిస్తాయి.ఉభయ చర జీవులు ఇవి.నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని,కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Exit mobile version