Site icon vidhaatha

చర్మంపైనా.. కరోనా ప్రతాపం..!

ప్రతి ఐదుగురిలో ఒకరికి చర్మ సమస్య
ఉస్మానియా చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్‌ రఘుకిరణ్‌
కరోనా సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏదో ఒక రకమైన చర్మ సమస్య ఉన్నట్టు పరిశోధనల్లో తేలిందని, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సమస్యలను అధిగమించవచ్చని ఉస్మానియా దవాఖాన చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్‌ రఘుకిరణ్‌ చెప్పారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడుతూ.

జ్వరంతోపాటు శరీరంపై దద్దుర్లు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
చిన్నారుల్లో చిల్‌బెన్‌ రాషెస్‌, యువతలో కాళ్లు, చేతివేళ్ల దగ్గర రక్తం గడ్డకట్టి చర్మం ఎర్రబారడం, లేదా నలుపు నుంచి వంకాయ రంగురాషెస్‌ వస్తున్నాయని తెలిపారు.
కరోనానుంచి కోలుకున్న వారిలో కూడా చర్మ సంబంధ సమస్యలు పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందని చెప్పారు.

చర్మంపై వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించడమే కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version