ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు

ఫోన్ ట్యాపింగ్ కేసులు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ 66 ఎఫ్ జోడిస్తూ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు

  • Publish Date - April 25, 2024 / 01:20 PM IST

ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు
నిందితులపై సైబర్ టెర్రరిజం కేసు

విధాత: ఫోన్ ట్యాపింగ్ కేసులు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ 66 ఎఫ్ జోడిస్తూ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు ఐటి ఆక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడనుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగు చూసిన సమయంలో ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పటికే ప్రభాకర్ రావుకు లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అమెరికాలోని టెక్సాస్ లో ప్రభాకర్ రావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసులను నమోదు చేసేందుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Latest News