Site icon vidhaatha

Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఇద్దరికి కోర్టులో ఎదురుదెబ్బ

విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్నలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల విచారణలో కోర్టులో వారికి ఎదురుదెబ్బ తగిలింది. వారి బెయిల్ పిటిషన్ల విచారణను నాంపల్లి కోర్టు జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. పంజాగుట్ట పోలీసులను ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌లో జైలులో ఉన్న భుజంగరావు, తిరుపతన్నలు గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో వారు మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా వారిద్ధరి వాంగ్మూలంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూడటంతో వారి బెయిల్ పిటిషన్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది

Exit mobile version