పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకమే కీలకం .. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి

కాలుష్యం నివారణకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచటమే మార్గమని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వన మహోత్సవ కార్యక్రమంలో కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

  • Publish Date - July 3, 2024 / 07:39 PM IST

విధాత,హైదరాబాద్ : కాలుష్యం నివారణకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచటమే మార్గమని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వన మహోత్సవ కార్యక్రమంలో కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కొండా సురేఖ మాట్లాడుతూ గతంలో భారీ వృక్షాలు ఉండేవని, చల్లని నీడను ఇచ్చే చెట్లు ఇప్పుడు కనిపించటం లేదన్నారు. భవిష్యత్తు ముందు తరాలకు మంచి జరగాలంటే ఇప్పుడు నుంచే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పందిర్లకు తీగలు మొక్కలు సైతం ఇప్పుడు చూద్దామన్న కనిపించటం లేదన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగాలన్నారు.

అడవుల నుంచి కోతులు ఊర్లలోకి రాకుండా ఫారెస్ట్ అధికారులు చూసుకోవాలన్నారు. అడవిలో దొరికే ఫలాలను కొతులకు అందేలా చూడాలని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా అనేక స్వచ్చంద పనుల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమాయి దంపతులు భాగం అవుతున్నారని తెలిపారు. మనిషి మనుగడకు మొక్కల పెంపకం కీలకమని, గతంలో పెద్దలు 100 సంవత్సరాలు బతికారంటే చెట్లే కారణం అన్నారు. ప్రతి నిత్యం మనిషి జీవితంలో చెట్లతో అవసరం ఉంటుందన్నారు. జ్ఞానం పెంపోదించుకోవాలన్న పచ్చని చెట్ల కిందకు వెళితే ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. వన మహోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, ఒక్కొక్క వ్యక్తి ఐదు నుండి పది మొక్కలు పెంచితే వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు.

Latest News