500 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 3వేల మందికి ఉపాధి అవకాశాలు
మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 90 లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యం
రూ.400 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా కంపెనీ ప్రారంభం
షాద్ నగర్ నియోజకవర్గంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు
విధాత:షాద్ నగర్,సిటీటైమ్స్: క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలో కొత్త ప్లాంటును నెలకొల్పింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడి చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఫెసిలిటీని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 90 లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని స్థాపించారు. ఈ తయారీ కేంద్రం ద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది.
ఈ ఏడాది మార్చి 24న ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ సిటీటైమ్స్ ప్రతినిధికి తెలిపారు. ఇటలీకి చెందిన పేటెంటెడ్ బ్రెటన్‌స్టోన్ టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొత్త కేంద్రం చేరికతో సంస్థ మొత్తం వార్షిక స్థాపిత సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుందని సీఈవో పరాస్ కుమార్ జైన్ వెల్లడించారు. పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఈ కేంద్రం నుంచి రూ.400 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ జంబో, సూపర్ జంబో సైజులో స్లాబ్స్‌ను తయారు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం వద్ద ఉన్న ఏపీసెజ్‌లో 2009లో కంపెనీ క్వార్జ్ సర్ఫేసెస్ తయారీ కోసం తొలి ప్లాంటును స్థాపించింది.
ఇంజనీర్డ్ స్టోన్, గ్రానైట్ ఉత్పత్తుల కంపెనీ పోకర్ణ లిమిటెడ్ హైదరాబాద్ సమీపంలోని మేకగూడ గ్రామం వద్ద ‘క్వార్ట్జ్ సర్ఫేసెస్’ ఉత్పత్తి చేసే నూతన కర్మాగారాన్ని నెలకొల్పింది. ఏడాదికి 9 మిలియన్ చదరపు అడుగుల ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.500 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ కర్మాగారాన్ని దాదాపు 1.6 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంటు వల్ల ప్రత్యక్షంగా 500 ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి కలుగుతుందని సంస్థ ఛైర్మన్ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. ఈ కర్మాగారంలో ఇటలీకి చెందిన అత్యాధునిక ‘బ్రెటన్‌స్టోన్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వెల్లడించారు. దీనివల్ల పోకర్ణకు ఉన్న క్వార్ట్జ్ సర్ఫేసెస్ ఉత్పత్తి సామర్థ్యం 1.50 కోట్ల చదరపు అడుగులకు పెరుగుతుందని వెల్లడించారు. పూర్తి సామర్థ్యం మేరకు ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేయగలిగితే, రూ.400 కోట్ల వార్షిక టర్నోవర్ నమోదు చేయవచ్చని వివరించారు. ప్రధానంగా సూపర్ జంబో సైజ్ 346×200, జంబో సైజ్ 330×165 క్వార్ట్జ్ స్లాబులు ఉత్పత్తి చేయగలమని పేర్కొన్నారు. వీటి తయారీకి సహజ సిద్ధ క్వార్ట్జ్‌తో పాటు బైండింగ్ పాలీమర్, లోహ రహిత పిగ్మెంట్లు వినియోగిస్తారు. ఈ శ్లాబులను వంటగదులు, బాత్‌రూముల్లో, మెట్లు, లిఫ్టులు.. తదితర ప్రదేశాల్లో వినియోగిస్తారు. ఫ్లోర్ టైల్స్ గా కూడా ఉపయోగించవచ్చు. ‘క్వాంట్రా’ అనే బ్రాండు పేరుతో శ్లాబులను పోకర్ణ లిమిటెడ్ విక్రయిస్తోంది. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాలకు క్వార్ట్జ్ శ్లాబులను ఎగుమతి చేస్తున్నారు. కాగా. పోకర్ణకు విశాఖపట్నంలోని అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లో ఇటువంటి కర్మాగారం ఇప్పటికే ఉంది..