విధాత(హైదరాబాద్) కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉపాధి కరువవడంతో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. తెల్లరేషన్ కార్డుదారులందరికీ, ఒక్కో మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.
రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి కూడా వారికి అందిస్తున్న విధంగా 2000 వేల రూపాయాలను 25 కిలోల బియ్యాన్ని అందచేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.