Site icon vidhaatha

ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,మంచిర్యాల జిల్లాల్లో రెడ్ అలర్ట్‌

విధాత,హైదరాబాద్‌:గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం స్థంభించింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రత్తమయ్యింది. తాజాగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాగా, వరదల వల్ల ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

Exit mobile version