విధాత:కాంగ్రెస్ ఎంపీ,టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకొని . శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి.. రామోజీరావును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో రేవంత్ సమావేశం కానున్నారు.
ఇప్పటివరకు రేవంత్ రెడ్డికి ఉత్తమ్, భట్టిలు కలిసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఉత్తమ్, భట్టిలతో మల్లు రవి మంత్రాంగం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మల్లు రవి.. భట్టి ఇంటికి వెళ్లి భేటి అయ్యారు.