విప్లవోద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు
విధాత, వరంగల్ ప్రతినిధి: దేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో రైతుకు భూమి దక్కలేదని, దున్నేవాడికే భూమికోసం అర్థవలస అర్థ భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా జరిగే గోదావరి లోయ ప్రతిఘటన పోరాట మార్గంలో పయనించడమే కామ్రేడ్ రాధక్కకు మనం అందించే ఘన నివాళి అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు అన్నారు.
గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నాయకురాలు సిపిఐ (ఎంఎల్ ) సీనియర్ నాయకురాలు కామ్రేడ్ రాదక్క సంతాప సభ ఆదివారం వరంగల్లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంగుల దయాకర్ అధ్యక్షత వహించగా ప్రధాన వక్తగా సాధినేని హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. భారత విప్లవోద్యమ నాయకులు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి సహచరి అయిన కామ్రేడ్ రాదక్క విప్లవోద్యమ నిర్మాణం కోసం తన శేష జీవితమంతా ధారబోసిందని ఆయన అన్నారు.
వరంగల్ ఖమ్మం మొదలుకొని ఉన్న గోదావరి పరిహార ప్రాంతంలో సాయుధ దళాల నిర్మాణం చేయడంలో ఆమె ప్రముఖ పాత్ర వహించిందని ఆయన కొనియాడారు. సిపిఎం పార్టీ నయా రివిజనిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తూ విప్లవకారుల నాయకత్వంలో ఏర్పడిన, ఉమ్మడి సిపిఐ ఎంఎల్ పార్టీలో పని చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. గోవర్ధన్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి. సంధ్య, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు లు మాట్లాడారు.
ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గౌని ఐలయ్య, సాగర్, రణధీర్, మామిడాల బిక్షపతి, జడ సీతారామయ్య, జి అనురాధ లతోపాటు పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బోనగిరి మధు, నాగరాజు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, మోకాళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సభకు వివిధ జిల్లాల నుండి న్యూ డెమోక్రసీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు సభ ప్రారంభ ప్రారంభానికి ముందు రాధక్కకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు.