Sama Ram Mohan Reddy | పదేళ్లు కేందం గుడ్డి గుర్రం పల్లు తోమిందా: సామ రాంమోహన్‌రెడ్డి

దేశంలోనే పేరోందని సింగరేణి సంస్థను బీఆరెస్ పదేళ్లలో ఆర్థిక విధ్వంసం చేసిందన్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు

  • Publish Date - June 23, 2024 / 02:23 PM IST

సింగరేణి విధ్వసంపై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు సామ కౌంటర్‌

విధాత: దేశంలోనే పేరోందని సింగరేణి సంస్థను బీఆరెస్ పదేళ్లలో ఆర్థిక విధ్వంసం చేసిందన్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సింగరేణిలో 49% వాటా ఉన్న కేంద్రం సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరుగుతుంటే బీఆరెస్‌పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని, అంటే అంటే కేంద్రం ఈ పది సంవత్సరాలు గుడ్డి గుర్రం పల్లు తోమిందా? అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు సామ రిప్లై ఇచ్చారు.

పార్లమెంటులో గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చట్టాలు చేసి సింగరేణిని విధ్వంసం చేసింది బీజేపీ కాదా? ఆ చట్టాలకు పూర్తి మద్దతునిచ్చింది బీఆరెస్‌ కాదా? అంటు సామ ప్రశ్నించారు. పది సంవత్సరాలు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని తమ అవినీతితో ఆర్థిక విధ్వంసం చేసిన బీఆరెస్‌పై ఒక్క విచారణ జరిపించకుండా కాపాడింది ఎవరు? మీరు కాదా? అంటూ సామ రామ్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో బీజేపీపై విరుచుక పడ్డారు.

Latest News