Site icon vidhaatha

Bandi Sanjay | ఎన్నికల పోరులో అలసి..అల్లుడితో ఉల్లాసంగా

కరీంనగర్ వీధుల్లో బండి సంజయ్ చక్కర్లు

విధాత : పార్లమెంటు ఎన్నికల పోరులో అలుపెరగకుండా సుదీర్ఘ ప్రచారం సాగించిన ఎంపీ అభ్యర్థులు..పోలింగ్ ముగిసిపోవడంతో కాస్తా సేద తీరే ప్రయత్నాలు చేస్తున్నారు. పోటాపోటీ ప్రచారం నేపథ్యంలో కుటుంబ సభ్యులకు తగిన సమయమివ్వలేని అభ్యర్థులు తమ ఎన్నికల ఫలితాల వెల్లడి కోసం జూన్ 4వ తేదీ వరకు 21రోజుల పాటు ఎదురుచూపులు పడాల్సివుండటంతో ఈ విరామంలో కుటుంబంతో జాలీగా గడపడంలో నిమగ్నమవుతున్నారు.

ఒక్కో అభ్యర్థి ఒక్కో రీతిలో ఎన్నికల బడలిక నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మాత్రం తన అల్లుడిని స్కూటీపై ఎక్కించుకుని పట్టణ వీధుల్లో చక్కర్లు కొట్టి, ఓ బేకరీకి వెళ్లి సరదాగా స్నాక్స్ , ఐస్ క్రీమ్ తిని ఉల్లాసంగా గడిపారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

Exit mobile version