Site icon vidhaatha

Trains To Bhadrachalam | భద్రాచలం రామయ్య కల్యాణం కోసం వెళ్తున్నారా..? సికింద్రాబాద్‌ నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయని తెలుసా..?

Trains To Bhadrachalam | శ్రీరామ నవమి వేడుకలకు యావత్‌ దేశం ముస్తాబువున్నది. యేటా హిందువులు ఎంతో వేడుకగా నిర్వహించిన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సీతారాముల కల్యాణాలు జరుగనున్నాయి. తెలంగాణలోని ప్రముఖ భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోనూ కల్యాణ వేడుకలను వైభోవోపేతంగా జరునున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం చూసేందుకు ఏటా వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కల్యాణ బ్రహోత్సవాలు కనుల పండువలా జరుగుతాయి. ఈ ఏడాది ఇప్పటికే ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నెల 9న ఉత్సవాలు మొదలవగా.. 23 వరకు కొనసాగనున్నాయి. ఇక రాముల వారి కల్యాణోత్సవాన్ని కనులారా చూసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భద్రాచలం వెళ్లే భక్తుల కోసం సికింద్రాబాద్‌ నుంచి రైళ్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

మణుగూర్ ఇంటర్ సిటీ, బీదర్, కృష్ణ ఎక్స్‌ప్రెస్‌, ఇంటర్ సిటీ, శాతవాహన, చార్మినార్, గౌతమి, గోల్కోండ తదితర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులు భద్రాచలం చేరుకోవచ్చు. అయితే, భద్రాచలం వరకు నేరుగా రైలు సదుపాయం లేదు. భద్రాచలం రోడ్‌ లేదంటే డోర్నకల్‌ రైల్వేస్టేషన్ల నుంచి భద్రాచలం చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. మణుగురు ఇంటర్ సిటీ రైళ్లు మాత్రం కొత్తగూడెం వరకు చేరుకుని.. అక్కడి నుంచి బస్సులో భద్రాచలం వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే, రైలు ప్రయాణంతో తక్కువ ఖర్చుతోనే భద్రాచలం చేరుకోవచ్చు. ఇక భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 17న జరుగనున్నది. ఉత్సవాల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. 18న పట్టాభిషేక మహోత్సవం జరుగనున్నది. 20న తెప్పోత్సవం, ఏప్రిల్ 21న ఊంజల్ సేవ ఉంటుంది. అదే రోజు రామయ్యకు సింహ వాహన సేవ సైతం నిర్వహించనున్నారు. 22న వసంతోత్సవం, ఏప్రిల్ 23న చక్ర తీర్థం, పూర్ణాహుతి, పుష్పయాగం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి.

Exit mobile version