Site icon vidhaatha

షర్మిల అనుచరుడు..మృతి

కరోనా కారణంగా షర్మిల అనుచరుడు బాలకృష్ణ రెడ్డి మృతిచెందాడు. ఎల్బీ నగర్‌లోని గుర్రంగూడలో నివసిస్తున్న ఈయన మృతితో పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. షర్మిల పార్టీ ప్రకటన నాటి నుంచి పార్టీ పనుల్లో చురుకుగా వ్యవహరించిన బాలకృష్ణ రెడ్డి మృతి తమకు తీరని లోటని షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా షర్మిల రూ.1లక్ష అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా పటాన్ చెరుకి చెందిన షర్మిల మరో ముఖ్య అనుచరుడు భరత్ రెడ్డి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అలాగే వరంగల్ జిల్లాకు చెందిన నాడెం శాంతకుమార్, అప్పం కిషన్ కరోనా బారిన పడ్డారు.

Exit mobile version