వారసత్వ కట్టడంగా రామప్పకు అర్హత
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రుల వినతి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌తో సమావేశం
విధాత:విఖ్యాత కాకతీయ సామ్రాజ్య ప్రాభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ నాగరికతా వైభవానికి ప్రతీక అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నది. 2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పటినుంచి ఈ ప్రయత్నాలు మరింత తీవ్రంగా జరుగుతున్నాయి. తాజాగా బుధవారం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, అధికారులు.. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిని కలిసి మళ్లీ అదే విజ్ఞప్తి చేశారు.