Site icon vidhaatha

Telangana | తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సాంకేతిక సమస్యతో చిక్కులు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఆధార్ లింక్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేషన్‌ లో సాంకేతిక సమస్య తలెత్తింది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన జనం కార్యాలయం వద్ద పడిగాపులు పడ్డారు. ఇండ్లు, ప్లాట్ల క్రయ విక్రయాల కోసం స్లాట్ చేసుకున్న వారంతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించారు.

గురువారం స్లాట్ బుక్ చేసుకున్న వారి రిజిస్ట్రేషన్లు శుక్రవారం పూర్తి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 140 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వాస్తవానికి ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 5వేల నుంచి 7వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. దీంతో రూ.60కోట్ల నుంచి రూ.70కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. గతంలో ఇదే తరహాలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం.

Exit mobile version