హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణకు బెయిల్

  • Publish Date - April 3, 2024 / 06:27 PM IST

విధాత, హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు షరతుతో కూడిన స్టాట్యూటరీ బెయిల్ మంజూరీ చేసింది. బాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు శివ నవీన్ కు కూడా బెయిల్ మంజూరీ చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు విధించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల విలువ డాక్యుమెంట్ వాల్యూ మేరకు 250కోట్లుగా అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో నాలుగురెట్లు అధికంగా 1000కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో 214 ఎకరాల పొలం, 29 ప్లాట్లు, ఏడు ఫ్లాట్లు, ఒక విల్లా, 5.5 కిలోల బంగారు ఆభరణాలను, బ్యాంకు లాకర్లలో 18 తులాల బంగారం, పాస్ బుక్‌లను కూడా గుర్తించారు. ఇవన్నీ కలిసి మార్కెట్‌ విలువ ప్రకారం 250 కోట్లు ఉంటాయని ఏసీబీ అంచనా వేసింది. ఈ కేసులో… బాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో హెచ్‌ఎండీఏ కమిషనర్లుగా వ్యవహారించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రమేయంపై కూడా ఏసీబీ విచారణ చేపట్టింది.

Latest News