Site icon vidhaatha

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: మంత్రి అల్లోల

ఆదిలాబాద్ :జిల్లాలో రెండో దశలో కొవిడ్ ప్రబలకుండా నియంత్రణ, నివారణ చర్యలు పటిష్టవంతంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో కరోనా నియంత్రణకు జిల్లాలో అమలు చేస్తున్న పటిష్ట చర్యలు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, హాస్పిటల్ మేనేజ్మెంట్, పేషంట్లకు వైద్య చికిత్సలు, కంటైన్మెంట్ జోన్స్, తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు,జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా వ్యాప్తి తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గిందన్నారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ లో ఎలాంటి ఆంక్షలు లేవని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక దేశంలో డెత్ రేట్ తక్కువగా ఉందన్నారు. అపోహలను వీడి ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎమ్మార్పీ ధరలకే రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లు విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Exit mobile version