Raithu Bharosa payments| రైతుల ఖాతాల్లోకి “భరోసా” డబ్బులు..సంక్రాంతికే!

రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించబోతుంది. రైతులకు యాసంగి పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా డబ్బులను సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. యాసంగి పంట సాగుకు వీలుగా రైతులకు రైతు భరోసా సహాయం ఎకరం రూ.6వేలు చొప్పున సంక్రాంతి కానుకగా రైతులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దమవుతుంది.

విధాత, హైదరాబాద్ : రైతుల( Telangana farmers)కు తెలంగాణ ప్రభుత్వం(Telangana government) తీపి కబురు అందించబోతుంది. రైతులకు యాసంగి పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా డబ్బుల(Raithu Bharosa payments)ను సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. యాసంగి పంట సాగు(yasangi crop support)కు వీలుగా రైతులకు రైతు భరోసా సహాయం ఎకరం రూ.6వేలు చొప్పున సంక్రాంతి(Sankranti release) కానుకగా రైతులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )ప్రభుత్వం సిద్దమవుతుంది. రాష్ట్రంలోని కోటిన్నర ఎకరాల మేరకు ఉన్న వ్యవసాయ భూములకు రెండు పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ.12వేలు రైతు భరోసా పేరుతో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందుకోసం బడ్జెట్ లో రూ.18వేల కోట్లు కేటాయింపు చేసింది. ఇదే క్రమంలో యాసంగి పెట్టుబడి సహాయంగా రూ.9వేల కోట్ల మేరకు రైతుల ఖతాల్లో జమ చేయనుంది.

వాన కాలం పంట సీజన్ లో 69.40లక్షల మంది రైతులకు రూ.8,744కోట్ల రైతు భరోసా సహాయాన్ని పంపిణీ చేసింది. యాసంగి సీజన్ లో ఈ సంఖ్యకు అటుఇటుగా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయనున్నారు. అయితే పంటల సాగు భూములకు మాత్రమై రైతు భరోసా సహాయాన్ని అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకున్న నేపథ్యంలో గ్రామాల్లో పంటల సాగు భూముల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు శాటిలైట్ ఇమేజింగ్ మ్యాప్ సహాయంతో సేకరిస్తున్నారు. యాసంగి రైతు భరోసా చెల్లించాల్సిన భూములు వివరాలు, రైతుల సంఖ్య, అవసరమైన నిధులపై వ్యవసాయ, ఆర్థిక శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఈనెల 29నుంచి జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ శీతకాల సమావేశాలలో రైతు భరోసా పంపిణీపై అధికారికంగా ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశముంది.

వాస్తవానికి డిసెంబర్ నెల ప్రారంభంలోనే యాసంగి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఆర్థిక, రాజకీయ అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం జనవరి నెలలో వేసే ఆలోచన చేస్తుంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైన పక్షంలో.. ఎన్నికల ముందు జనవరిలోనే ఖచ్చితంగా రైతు భరోసా డబ్బుల పంపిణీ చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Latest News