Site icon vidhaatha

Telangana | జూన్ 12 నుంచి పాఠశాలల పునః ప్రారంభం

2024-25విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల

విధాత, హైదరాబాద్ : తెలంగాణాలో 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలలు కొనసాగుతాయి.

అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు నిర్వహిస్తారు. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్ సెలవులు, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. 28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు, 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు.

Exit mobile version