Site icon vidhaatha

Telangana Polycet 2024 | తెలంగాణ పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

విధాత, హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వారికి జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. జులై 9న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. వీరికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. ఇంటర్నల్ స్లైడింగ్ కన్వీనర్ ద్వారా చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించారు. జులై 24లోపు అన్ని సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

Exit mobile version