8లోగా వీకెండ్ లాక్ డౌన్‌పై నిర్ణ‌యం తీసుకోవాలి..హైకోర్ట్

విధాత‌: తెలంగాణలో కరోనా విలయతాడవం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితుల పై హైకోర్టు విచారణ చేపట్టింది. నైట్ కర్ఫ్యూలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ప్రభుత్వం పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు పెరుగుతున్నా పట్టనట్టు ఉంటున్నారు. నైట్ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకోవడం ఏంటని నిలదీసింది. వీకెండ్ లాక్‌డౌన్ పై ఈ నెల 8 కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. రోజుకు కనీసం లక్షటెస్టులు కూడా చేయడం […]

  • Publish Date - May 5, 2021 / 07:34 AM IST

విధాత‌: తెలంగాణలో కరోనా విలయతాడవం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితుల పై హైకోర్టు విచారణ చేపట్టింది. నైట్ కర్ఫ్యూలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ప్రభుత్వం పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు పెరుగుతున్నా పట్టనట్టు ఉంటున్నారు.

నైట్ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకోవడం ఏంటని నిలదీసింది. వీకెండ్ లాక్‌డౌన్ పై ఈ నెల 8 కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. రోజుకు కనీసం లక్షటెస్టులు కూడా చేయడం లేదంటూ మండిపడింది. ఈ విచారణలో ప్రభుత్వం తరుపున డీజీపీ మహేందర్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు.

Latest News