విధాత,హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాలు ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నది. వీలైనంత త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు శాఖలవారీగా ఖాళీల సంఖ్యను గుర్తించిన ఆర్థికశాఖ అధికారులు సమగ్రమైన నోట్‌ను రూపొందించారు. దీనిపై చర్చించనున్న క్యాబినెట్ ఉద్యోగాల భర్తీ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయనున్నది. కృష్ణాపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రాష్ట్ర క్యాబినెట్ చర్చించనున్నది.