అమరుల స్థూపం వద్ద బ్యానర్ ప్రదర్శన
విధాత: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సినిమా దర్శకుడు, తెలంగాణ బిడ్డ సయ్యద్ రఫీ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు శనివారం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద బ్యానర్ ప్రదర్శించారు.
ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొని, ఇచ్చిన మాటకు కట్టుబడి, అమరుల త్యాగాలకు చలించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు, కాంగ్రెస్ పార్టీకి మన ఓటు వేసి రుణం తీర్చుకుందాం. తెలంగాణోళ్ల విధేయతను చాటుకుందాం? అని బ్యానర్‌లో కోరారు. అలాగే నిన్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తెచ్చుకున్నాం. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించుకొని, మన దేశాన్ని,తద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుందాం… భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని రఫీ పిలుపు ఇచ్చారు.