న్యూ ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. ఇటీవల మల్లికార్జున ఖర్గేకు వైద్యులు ఫేస్ మేకర్ వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, బీసీ రిజర్వేషన్ల అంశంపై మహేశ్ గౌడ్ చర్చించారు. హైకోర్టులో తెలంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 పైన స్టే ఇచ్చిన నేపథ్యంలో కేసును సుప్రీంకోర్టు లో వేసే అంశాలపై ఖర్గే తో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్రంలో చేపట్టిన కుల గణన నుంచి జీవో వరకు అన్ని అంశాలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. టీపీసీసీ చీఫ్ వెంట ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఉన్నారు.
ఖర్గేను కలిసిస టీపీసీసీ చీఫ్.. ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ.. బీసీ రిజర్వేషన్లపై చర్చ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిశారు..ఆయనను పరామర్శించించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, బీసీ రిజర్వేషన్ల అంశంపై మహేశ్ గౌడ్ చర్చించారు
