తెలంగాణలో నాలుగు రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రేపట్నుంచి 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్‌లు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
హోం ఐసోలేషన్‌లోని వారు మూడు, నాలుగు రోజులకొకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలని, అన్ని జిల్లా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 600 టన్నుల ఆక్సిజన్ కోరితే కేంద్రం 306 టన్నులు కేటాయించిందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు.