Site icon vidhaatha

యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ సేవ‌లు ర‌ద్దు

ప్రస్తుత కొవిడ్ -19 ప‌రిస్థితుల్లో యు.ఎస్. కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ త‌న అన్ని సాధార‌ణ సేవ‌ల‌ను నిలిపివేయనుంది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్స్‌, వీసా రెన్యూవ‌ల్స్ స‌హా అన్ని సాధారణ వీసా సేవల‌ను మే 3వ తేదీ నుండి ర‌ద్దు కానున్న‌ట్లు పేర్కొంది. తదుపరి ఆదేశాలు వెలువ‌డే వ‌ర‌కు ఇది అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

యు.ఎస్. కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ప్రకారం.. అన్ని సాధారణ అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్స్ ఏప్రిల్ 27 నుండి తదుపరి నోటీసు వరకు రద్దు చేయబడతాయి. కాగా స్థానిక పరిస్థితులు అనుకూలించే వ‌ర‌కు అత్యవసర అమెరికన్ సిటిజన్ సేవలు, వీసా నియామకాలు కొనసాగుతాయంది. ఈ సమయంలో ఇప్ప‌టికే షెడ్యూల్ చేసిన అత్యవసర అపాయింట్‌మెంట్స్‌ను కొన‌సాగించేందుకు తాము అన్ని విధాల‌ ప్రయత్నిస్తామ‌ని ఒక ప్రకటనలో తెలిపింది.

Exit mobile version