Site icon vidhaatha

నయీమ్‌ కేసు మళ్లీ తెరువాలి.. అతని ఆస్తుల జాడ తేల్చాలి: వీహెచ్ డిమాండ్

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు దేశంలోనే సంచలనంగా మారిందని, ఇప్పటికే పలువురు అధికారులను అరెస్టు చేసి విచారణ చేపట్టిన ప్రభుత్వం దోషులను వదలబోదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారుల అక్రమాలు చూస్తే నయీమ్‌ కేసును మళ్లీ తెరిచి విచారణ జరిపించాల్సిన అవరసముందన్నారు. నయీమ్ కేసులో ఉన్న నాయకులు, పోలీసు అధికారులు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఆ కేసులో పోలీసు అధికారుల పాత్ర తేల్చాలని కోరారు. బీఆరెస్ ప్రభుత్వం నయీమ్ కేసును ఆర్థిక ప్రయోజనాల కోణంలో నీరుగార్చిందని ఆరోపించారు. నయీమ్‌కు సంబంధించిన వందల కోట్ల ఎకరాల పేదల భూములు, కూడబెట్టిన ఆస్తులు, డబ్బులు ఎక్కడకు పోయాయో ప్రజలకు తెలియాలని, అందుకే ఈ కేసును తిరిగి విచారించాలని విహెచ్ డిమాండ్ చేశారు.

Exit mobile version