Site icon vidhaatha

Revanth Reddy | రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవ‌డానికి ఇండియా కూట‌మిని గెలిపించండి

వీడియో సందేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత‌: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇచ్చారు. ఈ మేర‌కు శ‌నివారం ప్ర‌చార స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి కొద్ది గంట‌ల ముందు ఒక వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి … రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని అన్నారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని తెలిపారు.

అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదిగార‌ని చెప్పారు. రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Exit mobile version