ఆరునెలల్లో టెక్స్ టైల్ పార్క్ పనులు ప్రారంభిస్తాం లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం భూమిని కేటాయించాము… కానీ కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం లేదని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరంతర పోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వనికి సహకరించడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు.