Site icon vidhaatha

చివరి శ్వాస వరకూ టీఆర్‌ఎస్‌తోనే: దానం

విధాత,హైదరాబాద్‌: ‘చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌తోనే ఉంటా. విధేయతతో కేసీఆర్, కేటీఆర్‌ నాయకత్వం కిందే పనిచేస్తా. నా ఇంటికి ఎవరు వచ్చినా టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని రావాల్సిందే’ అని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో చిచ్చు పెట్టేవారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

రేవంత్ డ‌బ్బులిచ్చి ప‌ద‌వి తెచ్చుకున్నారు

డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నరేవంత్‌రెడ్డి ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసన్నారు. రేవంత్‌ నాయకత్వంలో ఎలా పనిచేస్తారో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను మంత్రి పదవి అడగలేదని ఇకముందు కూడా అడగని దానం స్పష్టం చేశారు.

Exit mobile version