Sammakka Sarakka Central Tribal University:తెలంగాణ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (SSCTU) మొదటి వైస్ ఛాన్సలర్‌గా వైఎల్. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఐదేళ్ల పాటు శ్రీనివాస్ ఈ పదవిలో కొనసాగనున్నారు.
కాగా సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వీసీగా వైఎల్. శ్రీనివాస్ నియామితులవ్వడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో నాక్(NAAC) సహకారంతో ఆంగ్ల విద్య, పరిపాలనలో, నాయకత్వ నిర్మాణంలో మూడు దశాబ్దాల పాటు అంకిత భావంతో శ్రీనివాస్ చేసిన సేవ, అనుభవం, నైపుణ్యం సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భవిష్యత్తును రూపొందించడంలో ఎంతో ఉపయోగపడనుందన్నారు.
ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో భారతదేశంలో ఉన్నత విద్యను బలోపేతం చేయడం, గిరిజన సంఘాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం ముందుకెలుతుందన్నారు. ఈ కీలక పాత్రలో మీరు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని శ్రీనివాస్ కు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.