Site icon vidhaatha

దేశ ప్రజల ఆకాంక్ష మేరకే జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్: మంత్రి జగదీశ్ రెడ్డి

విధాత, నల్గొండ: దేశ ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నివాస గృహంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకీ రావడం చారిత్రక అవసరమన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష కూడా అదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావగా తయారైనదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ మతవైషమ్యాలను రెచ్చగొడువుతుందన్నారు.

దేశ అభ్యున్నతికి ఎవరో ఒకరు ముందుకు రావడం అనివార్యమన్నారు. ఇప్పుడు యావత్ దేశం చూపు
ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉందన్నారు. తెలంగాణా సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తారన్నారు. అభివృద్ధిలో వెనుక బెడుతున్న దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంగా పెట్టుకున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం అన్నారు. లక్ష్య సాధనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల పోరాటాలు చారిత్రాత్మకమైనవన్నారు.

Exit mobile version