విధాత, హైదరాబాద్: దేశానికే తెలంగాణ ఆదర్శమని కేసీఆర్ డప్పుకొట్టుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్భా విద్యాలయాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు సిబ్బంది నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇది పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని, కేవలం 12 రోజుల వ్యవధిలోనే కుమురం భీం జిల్లా అయిదు మరణాలు నమోదు కావడం ఆందోళ కలిగిస్తోందన్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్న దీన దుస్థితిపై రేవంత్ అధికార పార్టీ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. పేద బిడ్డల వసతి గృహాలు నరకానికి ఆనవాళ్లుగా మారాయని హాస్టళ్లలో చావు డప్పు మోగుతున్నయన్నారు. ముఖ్యమంత్రి గారూ.. మీకు మానవత్వం ఉందా!? ఉంటే చలించడం లేదెందుకు!? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.