విధాత, నల్గొండ: నల్గొండ పట్టణం వన్ టౌన్ పరిధిలోని హనుమాన్ నగర్ గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి గణేష్ నిమజ్జోత్సవాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి రేమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.