Site icon vidhaatha

26 నుంచి ఓటీటీల్లో రిపబ్లిక్, రొమాంటిక్

విధాత: ఓటీటీలో సినిమాల దండయాత్ర ప్రారంభమైంది. కరోనా వల్ల గతేడాది విడుదల కావాల్సిన చాలా సినిమాలు ఇప్పుడు పరిస్థితులు మెరుగు పడడంతో ప్రతి వారం 4,5 సినిమాలు థియేటర్లలో విడుదల చేస్తుండగా అక్కడ ఆదరణ ఉన్నా లేకున్నా మంచి రేటు లభిస్తుండడంతో అంతే త్వరగా ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఆక్టోబర్ లో రిలీజ్ అయిన సీనిమాలు ఓటీటీలోకి వచ్చేయగా ప్రస్తుతం నవంబర్ మొదటి వారం వరకు రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలోకి రానున్న వారం రోజుల్లో రానున్నాయి.

వాటిల్లో ముఖ్యంగా జీ5లో రిపబ్లిక్, ఆహలో రొమాంటిక్ సినిమాలు నవంబర్ 26 న విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా వెంకటేష్ నటించిన దృశ్యం 2 సినిమా, మోహన్ లాల్ నటించిన మరక్కన్ సినిమాలు డైరెక్టుగా అమెజాన్ లో నవంబర్ 25న విడుదల కానున్నాయి.

Exit mobile version