Site icon vidhaatha

తెలంగాణ‌: నూత‌న శాసనమండలి సభ్యుల‌ ప్రమాణస్వీకారం

విధాత‌: కొత్తగా ఎన్నికైన ఐదుగురు శాసనమండలి సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. గుత్తా సుఖేందర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్‌ రావు, పరుపాటి వెంకట్రామిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వీ భూపాల్‌రెడ్డి ప్రమాణం చేయించారు.

అనంతరం సభ్యులను మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, శాసనసభ‌ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నర్సింహాచార్యులు అభినందించారు.

వీరితో పాటుగా వివిధ జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version