Site icon vidhaatha

ఐదు రోజుల్లో కాలువలో నీటి సరఫరా పునరుద్ధరిస్థాం: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత, నల్గొండ: గండి పడిన సాగర్ ఎడమ కాలువ కట్ట మరమ్మతు పనులను ప్రారంభించామని 5 రోజుల్లో కాలువలో నీటి సరఫరా పునరుద్ధరిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో అని విలేకరులతో మాట్లాడుతూ..

ఎమ్మిగనూరు మండలం ముప్పారం వద్ద సాగర్ ఎడమ కాల్వకు గండిపడిన ఘటనపై మంత్రి స్పందిస్తూ కాలువ గట్టుకు కాకుండా మధ్యలో బుంగ పడిందని, గండి పడటానికి తోడు నీరు అధికంగా ఉండటమే సిబ్బంది గండి ప్రాంతాన్ని గుర్తించలేక పోవడానికి కారణమన్నారు.

గండి పడిన ఐదు నిమిషాల్లో నే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారన్నారు. అధికారుల అప్రమత్తతోనే ప్రమాదం తప్పిందన్నారు. కాలువలో నీరు నిండుగా ఉండటానికి తోడు నీటి మధ్యలో బుంగ పడటంతోనే సాగర్ ఎడమ కాలువ ప్రమాదాన్ని గుర్తించడంలో ఆలస్యమైందన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని కూడా యుద్ద ప్రాతిపదికన బయటకు పంపగలిగమన్నారు.. అకాల వరద తో అదృష్టవశాత్తు పెద్దగా నష్టం జరుగలేదన్నారు.. ఎవరైనా నష్టపోతే వారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారని అన్నారు.. నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే వారిని ఆదుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

Exit mobile version