Site icon vidhaatha

విషం కలిపిన ధాన్యం తిని 19 నెమళ్ల మృతి

విధాత‌:తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలో ఓ పొలం వద్ద 19 నెమళ్ళు మృతిచెంది పడివుండడం అటవీ శాఖ అధి కారులు కనుగొన్నారు. పల్లడం సమీపంలోని ఓ చేనులో విషం కలిపిన ధాన్యాలు తిని ఆ నెమళ్ళు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఆ నెమళ్ళకు విషమిచ్చి చంపిన వ్యక్తుల ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version