విధాత:భారతదేశం సరిగ్గా రెండుసంవత్సరాలక్రితం ఆగష్టు 5 వ తేదిన ఆర్టికల్ 370,35ఎ ను రద్దు చేస్తూ జమ్ము,కాశ్మీర్ అలాగే లడాఖ్ ను కలిపి రెండూ వేరు వేరు కేంద్రపాలితప్రాంతాలుగా చేసింది.అప్పటి నుండి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ ప్రదేశాలను టూరిజం,పారిశ్రామికల పరంగా అభివృద్ధి చేస్తామని పనులు వేగవంతం చేయసాగింది కాని అంతలో కరోనా మహమ్మారి మూలంగా పనులు నిలిచిపోయాయి.ఇప్పటి వరకూ ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడలేదు దీంతో అభివృద్ధి శూన్యం అయిందని అయినా ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించి పేదరికాన్ని పోగొడుతుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.