Site icon vidhaatha

భార‌త్‌కు 5 కోట్ల ఫైజ‌ర్ టీకాలు..!

విధాత‌(న్యూఢిల్లీ): అగ్ర‌రాజ్య ఫార్మా సంస్థ ఫైజ‌ర్‌.. ఇండియాకు 5 కోట్ల కోవిడ్ టీకాల‌ను అమ్మే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి భార‌త ప్ర‌భుత్వంతో ఆ సంస్థ చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మూడ‌వ త్రైమాసికంలో ఆ టీకాలు స‌ర‌ఫ‌రా అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుత మార్కెట్‌లో ఫైజ‌ర్ వ్యాక్సిన్ ధ‌ర ఎక్కువ‌గా ఉంది. అయితే కేవ‌లం వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసేందుకే ప్ర‌భుత్వం ఫైజ‌ర్ టీకాల‌ను కొనుగోలు చేయాల‌ని చూస్తోంది.

వ్యాక్సిన్ల కొర‌త ఉన్న నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాలు గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. అమెరికాలో ప్ర‌స్తుతం ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ దేశం ఆ రెండు టీకాల‌ను ఇత‌ర దేశాల‌కు ఇచ్చేందుకు ఇంకా సుముఖంగా లేదు. అమెరికాలో పూర్తి స్థాయి వ్యాక్సినేష‌న్ జ‌రిగిన త‌ర్వాత‌నే.. ఇత‌ర దేశాల‌కు టీకాల‌ను విక్ర‌యించేందుకు ఆ దేశం ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

Exit mobile version