కోల్‌కతా : మమతా బెనర్జీకి .. హైకోర్టు జడ్జి కౌశిక్ చందా 5 లక్షల జరిమానా విధించారు. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ మమతా బెనర్జీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ కేసునుంచి జడ్జి కౌశిక్ తప్పుకోవాలని మమతా కోరారు. జస్టిస్ చందాకు బీజేపీ నేతతో లింకులు ఉన్నాయని, అందుకే తన కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని మమతా బెనర్జీ కోరారు. కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలో ఆమె ఈ అభ్యర్థన చేశారు. ఈ నేపథ్యంలో ఆ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి కౌశిక్ చందా తెలిపారు. అయితే ఆ కేసును విడిచిపెట్టే ముందు ఆయన మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జికి కళంకం తెచ్చే విధంగా సీఎం మమతా బెనర్జీ ముందస్తుగా ప్రణాళికి వేసుకున్నట్లు కౌశిక్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన విధులను ఆమె ఉల్లంఘించినట్లు జడ్జి పేర్కొన్నారు